కొత్తపేటలో పేరుకుపోతున్న చెత్త
NEWS Sep 15,2024 05:52 am
వారం రోజులుగా కొత్తపేట పంచాయతీ పరిధిలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు జీతాల కోసం విధులు బహిష్కరించారు. దీంతో కొత్తపేట మండల కేంద్రంలోని వీధుల్లో చెత్త భారీగా పేరుకుపోతుంది. ప్రధానంగా మార్కెట్‌లో దుర్వాసన వస్తోందని, అంటురోగాల బారిన పడే అవకాశం ఉందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు పారిశుద్ధ్య కార్మికులతో చర్చించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.