KNR: ట్రైన్పై రీల్స్.. విద్యుత్ వైర్లు తాకి గాయాలు
NEWS Sep 15,2024 04:34 am
రైలు పైకి ఎక్కి రీల్స్ చేస్తుండగా హైటెన్షన్ వైర్లు తాకి యువకుడు గాయాలపాలైన ఘటన WGL జిల్లా కాజీపేటలో శనివారం జరిగిన విషయం తెలిసిందే. స్థానికుల ప్రకారం.. KNR జిల్లా హుజురాబాద్కు చెందిన రాజ్ కుమార్(18) కడిపికొండ దగ్గరలో గల రాంనగర్ సమీప రైల్వే ట్రాక్పై ఆగిఉన్న గూడ్స్ రైలుపై సెల్ఫీలు దిగుతూ రీల్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలో విద్యుత్ వైర్లు తాకడంతో 70% శరీరం కాలిపోయింది. MGMలో చికిత్స అందిస్తున్నారు.