విష జ్వరాలు తగ్గాలని గణపతి హోమం
NEWS Sep 15,2024 04:35 am
మెట్ పల్లి: విష జ్వరాలు తగ్గాలని జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలో భరత్నగర్ యువసేన ఆధ్వర్యంలో గణపతి హోమం నిర్వహించారు. గత రెండు నెలల నుంచి గ్రామంలో విష జ్వరాలతో పాటు.. కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు వారు తెలిపారు. అనంతరం మహిళలు లక్ష్మీ పూజ, కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. అనంతరం సామూహికంగా అన్నదానం నిర్వహించారు.