ఆత్మకూర్లో గణనాథునికి 101 నైవేద్యలు
NEWS Sep 15,2024 04:36 am
మెట్ పల్లి మండలం ఆత్మకూరు గ్రామంలో శనివారం సాయంత్రం స్నేహంజలి యూత్ ఆధ్వర్యంలో గణనాథునికి నూట ఒక్క రకాల ప్రసాదాలను భక్తులు సమర్పించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు గణనాథుని కి పాలాభిషేకం చేయడం జరిగింది. మహిళల కోలాటం, పిల్లల నృత్యాలు, పెద్దల భజనలతో ఉత్సాహంగా గడిపారు. అనంతరం యూత్ సభ్యులు మహా నైవేద్యాలను భక్తులకు పంచిపెట్టారు.