ధర్మపురి పుణ్య క్షేత్రంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. పట్టణంలోని కన్యకా పరమేశ్వరి ఆలయ ఆవరణలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా 8వ రోజు వర సిద్ధి వినాయకుడిని వివిధ రకాల కూరగాయలతో అలంకరించారు. శాకాంబరుడైన విఘ్నేశ్వర స్వామి వారిని పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు.