బ్రేకింగ్ నౌ లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. అరకు వారపు సంతలో ప్లాస్టిక్ వ్యర్ధాలతో పారిశుధ్యం పేరుకు పోవడంతో ఈనెల 14న అపరిశుధ్యంగా వారపు సంత అనే పేరిట కథనం బ్రేకింగ్ నౌ లో ప్రచురితమైంది. దీంతో స్పందించిన స్థానిక పంచాయతీ కార్యదర్శి వల్లి వారపు సంతలో సందర్శించి పేరుకుపోయిన అపారిశుద్ధ్యన్ని తొలగించారు. ఈ సమస్యపై కృషిచేసిన బ్రేకింగ్ నౌ కు స్థానిక గిరిజనులు కృతజ్ఞతలు తెలిపారు.