ఉత్తమ్ కమిటీని ఉపసంహరించుకోవాలి
NEWS Sep 15,2024 04:41 am
ఎమ్మార్పీఎస్ వర్గీకరణకు వేసిన ఉత్తమ్ కమిటీని ఉప సంహరించుకోవాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు డిమాండ్ చేశారు. జోగిపేటలో శనివారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. మాలలకు అన్యాయం చేస్తే ప్రభుత్వానికి బుద్ది చెప్తామన్నారు. సమావేశంలో దీనబాందవ్, మ్యాతరి కరుణాకర్, మండల ఉపాధ్యక్షులు పరిపూర్ణం, మండల ముఖ్య సలహాదారులు బహుజన ప్రసాద్, సటికే రాజు, దాసరి దుర్గయ్య,పెండా గోపాల్, చెట్టయ్య పాల్గొన్నారు.