సిద్దిపేటలోని ఓ షాపింగ్ మాల్ యజమాని దంపతులు మాజీ మంత్రి హరీష్ రావుపై ప్రత్యేక అభిమాని చాటుకున్నారు. నూతనంగా షాపింగ్ మాల్ ప్రారంభించిన ఆ దంపతులు హరీష్ రావు చిత్రపటాన్ని దారాలతో వేశారు. ఆ చిత్రపటాన్ని శనివారం హరీష్ రావుకి అందజేశారు. ఈ దారం అల్లికకు దాదాపు 15 రోజులు పట్టిందని. హరీష్ రావుపై ఉన్న అభిమానాన్ని గుర్తుగా దాన్ని తయారు చేసినట్లుగా వారు తెలిపారు..