సిద్దిపేట: సీఎం రేవంత్ రెడ్డి ప్రైవేట్ ఉపాధ్యాయుల గురించి తక్కువ చేసి మాట్లాడడం తగదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలోని పోలీస్ కన్వెన్షన్ హాల్లో ట్రస్మా జిల్లా శాఖ అధికార్యంలో నిర్వహించిన గురుపూజోత్సవం ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం కేవలం ప్రభుత్వ టీచర్లను మాత్రమే సన్మానించిందని ఆరోపించారు. గురువులంతా సమానమేనని ప్రైవేటు ఉపాధ్యాయులను కూడా సన్మానించాలని సూచించారు..