గణేశ్ నిమజ్జనం కోసం 25,000 పోలీసులు
NEWS Sep 14,2024 07:08 pm
హైదరాబాద్‌లో నిమజ్జనం కోసం హైదరాబాద్‌కు చెందిన 15 వేల సిబ్బందితో పాటు బయటి నుంచి మరో 10 వేల మందిని రంగంలోకి దింపుతున్నట్లు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. 16, 17 తేదీల్లో విగ్రహాల నిమజ్జనం ఉందని, దీంతో ఈ 2 రోజులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 25 వేల మంది పోలీసులు దాదాపు 40 గంటల పాటు పహారా కాస్తారన్నారు.