జగిత్యాల: మహిళల రక్షణకే షీ టీం: ASI
NEWS Sep 14,2024 06:33 pm
జగిత్యాల SC, ST మహిళా వెల్ఫేర్ హాస్టల్లో జగిత్యాల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థినులకు భద్రతాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షీ టీం ASI మాట్లాడుతూ.. మహిళల రక్షణకు షీ టీం ప్రత్యేకంగా పనిచేస్తుందన్నారు. విద్యార్థినులను వేధించినా, ర్యాగింగ్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆకతాయిలు అమ్మాయిలను వేధిస్తే 100కు డయల్ చేయాలని సూచించారు.