వినాయక నిమజ్ఙనం కోసం ట్రాక్టర్ కడగడానికి చెరువు వద్దకు వెళ్లి యువకుడు చెరువులో పడి మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన నర్సాపూర్ లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వినాయక నిమజ్జనం సందర్భంగా మండలంలోని అవంచ గ్రామానికి చెందిన గంట శ్రీను తన స్నేహితులతో కలిసి చెరువు దగ్గర ట్రాక్టర్ కడగడానికి వెళ్ళాడు. ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందగా ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.