రక్త దానం చేసిన మహారాజ్ మండప సభ్యులు
NEWS Sep 14,2024 06:20 pm
సిరిసిల్లలోని జేపీనగర్ కి చెందిన మహారాజ్ మండపం వారి అద్వర్యంలో ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఉచిత కంటి వైద్య బృందంతో ఇండియన్ రెడ్ క్రాస్ సోసైటి సభ్యులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహారాజ్ మండప్ సంఘ సభ్యులందరూ 28 మంది పాల్గొని రక్త దానం చేశారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల టౌన్ సీఐ కృష్ణ, సిరిసిల్ల అర్బన్ బ్యాంకు చైర్మన్ రాపెల్లి లక్ష్మీనారాయణ, కౌన్సిలర్ కల్లూరి రాజు పాల్గొన్నారు.