రైతులకు ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల వరకు పంటరుణాలను మాఫీ చేయడంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు భట్టి విక్రమార్క. ఎలాంటి హామీ ఇవ్వకపోయినప్పటికీ 2 లక్షలకు పైగా ఉన్న పంట రుణాలను మాఫీ చేయాలని ఆలోచిస్తున్నామని తెలిపారు. 2 లక్షల రుణమాఫీ కింద అతి తక్కువ సమయంలో రూ. 18 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేశామని తెలిపారు. పంటల బీమా పథకం కింద రైతుల పక్షాన ప్రీమియం ప్రజా ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు.