విద్యార్థి సంఘాలకు ఏచూరి ఆదర్శం
NEWS Sep 14,2024 03:58 pm
సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి పట్ల ఎస్ఎఫ్ఐ ఆందోల్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో భారీ క్యాండిల్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రోళ్ల మహేష్ మాట్లాడుతూ.. వామపక్ష విద్యార్థి సంఘాలు ఏచూరిని ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని అన్నారు, ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.