వాహనాలపై ఎగబడుతున్న వీధి కుక్కలు
NEWS Sep 14,2024 03:36 pm
జగిత్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. అటుగా వెళ్లే వాహన చోధకులపై ఎగబడుతున్నాయి. పాదాచారుల వెంట పడి కరుస్తున్నాయి. ఈ ప్రాంతంలో రెండు ప్రైవేటు పాఠశాలలు, సాయిబాబా మందిరం ఉన్నాయి. బాబా దర్శనం కోసం వెళ్ళేవారు, పాఠశాలల్లో పిల్లలను దిగబెట్టేవారు నిత్యం ఇక్కడి నుండి వెళ్తుంటారు. అయితే వీధి కుక్కల సంచారంతో అటుగా వెళ్ళాలంటేనే ప్రజలు జంకుతున్నారు.