పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం
NEWS Sep 14,2024 03:50 pm
మెట్‌పల్లి: పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని ప్రతి ఒక్కరు పౌష్టికాహారం తీసుకోవాలని అంగన్వాడి టీచర్ ప్రమీల అన్నారు. మెట్‌పల్లి మండలంలోని మెట్ల చిట్టాపూర్ తండాలో వినాయక మండపం వద్ద శనివారం పోషణ మాసోత్సవంలో భాగంగా బాలామృతం, పౌష్టికాహారపై ఆమె అవగాహన కల్పించారు. గ్రామస్థులతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆయా బేబీ, మహిళలు తదితరులు పాల్గొన్నారు.