నిమజ్జనం రోజు అల్లర్లు సృష్టిస్తే రౌడీషీట్లు
తెరుస్తాం: మెట్‌పల్లి సీఐ
NEWS Sep 14,2024 03:03 pm
మెట్‌పల్లి సర్కిల్ పరిధిలో వినాయక నిమజ్జనం రోజు అల్లర్లు సృష్టిస్తే వారిపై రౌడీ షీట్లు తెరుస్తామని సీఐ నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. నిమజ్జనం ప్రశాంతంగా జరగడానికి 200 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నామని, 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. నిమజ్జనం రాత్రి 11 గంటల వరకు ముగించాలని, డీజేలు వినియోగిస్తే సీజ్ చేస్తామన్నారు. మద్యం షాపులు మూసివేయాలన్నారు. ప్రధాన దారిపై వన్ వే ఉంటుందన్నారు.