అన్నదానం, కుంకుమ పూజలు
NEWS Sep 14,2024 03:47 pm
మల్లాపూర్‌తో పాటు పలు గ్రామాల్లో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మండల కేంద్రంలో వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కుంకుమ పూజలు, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ యూత్, ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం, పద్మశాలి యువసేన కుంకుమ పూజలను నిర్వహించారు. యూత్ సభ్యులు, మహిళలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.