రాయికోడ్ ఎస్సైగా నారాయణ బాధ్యతలు
NEWS Sep 14,2024 02:57 pm
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ పోలీస్ స్టేషన్ ఎస్సైగా ఎస్. నారాయణ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎస్ఐగా పనిచేసిన కృష్ణయ్య బదిలీపై ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. రాయికోడ్ పోలీస్ స్టేషన్ కు ఎస్సైగా నారాయణ బదిలీపై వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎస్సై నారాయణ మాట్లాడుతూ.. శాంతి, భద్రతలకు ప్రజలు సహకరించాలని కోరారు.