గణేష్ మండలి అన్నప్రసాద కార్యక్రమం
NEWS Sep 14,2024 02:56 pm
MNCL: జిల్లా కేంద్రంలోని హమాలీ వార్డులో గల శ్రీ భక్తాంజనేయ సాయి గణేష్ మండలి వద్ద శనివారం రోజున గణేష్ మండలి కమిటీ సభ్యుల నేతృత్వంలో అన్నప్రసాద కార్యక్రమం చేశారు. 15 సంవత్సరాల నుంచి గణపతిని కొలుస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు నవీన్, మనోజ్, అఖిల్, నాగార్జున, క్రాంతి శ్రావణ్, శివకుమార్, ప్రసన్న, మహేష్ తదితరులు పాల్గొన్నారు.