మెగా ఉచిత వైద్య శిబిరం
NEWS Sep 14,2024 01:50 pm
అరకువేలి మండలంలో తేరు వారపు సంతలో సచివాలయం కేంద్రంగా మిథలీ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చిన డాక్టర్లు వీర్రాజు, డాక్టర్ కృష్ణమోహన్, ప్రియాంక రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు, మందులు పంపిణి చేసారు.