తిరుపతికి చెందిన కౌశిక్ (19) ఎన్టీఆర్ వీరాభిమాని బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. తనను దేవర మూవీ విడుదల వరకూ బతికించండి అంటూ వేడుకున్నాడు. దీంతో ఎన్టీఆర్ వెంటనే స్పందించి కౌశిక్‌తో వీడియో కాల్‌లో మాట్లాడాడు. నువ్వు నవ్వితే బాగున్నావ్.. అని ఎన్టీఆర్ అనగానే.. ఉత్సాహంగా మాట్లాడాడు కౌశిక్. త్వరగా కోలుకుని బయటకు రావాలని ప్రార్థిస్తాను అని తారక్ ధైర్యం చెప్పాడు.