హిమాలయ పర్వతాల మధ్య గణనాథుడు
NEWS Sep 14,2024 01:16 pm
మెట్‌పల్లి: మండలంలోని బండలింగాపూర్ గ్రామంలో గంగపుత్ర మత్స పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో హిమాలయ పర్వతాల మధ్య ఏర్పాటు చేసిన గణనాథుడు ఆకట్టుకుంటున్నాడు. అధిక సంఖ్యలో భక్తులు గణనాథుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. మంటపం వద్ద శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదానము ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.