ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్
NEWS Sep 14,2024 02:53 pm
శివంపేట: జల్సా లకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్న ఒక దొంగను పోలీసులు వల పని పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం శివంపేట మండలం కొత్తపేట గ్రామపంచాయతీ పరిధిలోని రూపుల తండా చెందిన జర్పుల మోహన్ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటిముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను చోరీ చేసిన కేసులో ఇతన్ని అరెస్ట్ చేసినట్టు ఎస్పీ తెలిపారు. ఇతని వద్ద 17 ద్విచక్ర వాహనాలు, కొనుగోలు చేసిన నరేష్ అనే వ్యక్తి వద్ద ఒక వాహనం స్వాధీనం చేసుకున్నారు.