ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిని
సందర్శించిన మంత్రి సత్యకుమార్
NEWS Sep 14,2024 02:40 pm
రాజమండ్రిలోని ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిని వైద్యారోగ్య శాఖ మంత్రి వై.సత్య కుమార్ యాదవ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న భవన నిర్మాణాలను, వైద్య కళాశాలను పరిశీలించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సదుపాయాల గురించి ఆయన రోగులను అడిగి తెలుసుకున్నారు.