అరకులోయ పట్టణ కేంద్రంలోని హైస్కూల్ రోడ్డులో వినాయక చవితి నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో భాగంగా శనివారం మధ్యాహ్నం రెడ్ రెబల్స్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో వర్తకులు, స్ధానికుల సహకారంతో సుమారు 3000 మంది భక్తులకు భారీ అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ అన్న సమారాధనలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని, స్వామివారి ప్రసాధాన్ని స్వీకరించారు.