డుంబ్రిగుడ: డుంబ్రిగుడ మండలంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని TNTUC అరకు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ఎం స్వామి కోరారు. ఈమేరకు గిరిజన సంక్షేమశాఖ మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ముఖ్యంగా డుంబ్రిగుడ మండల కేంద్రంలో సీసీ రోడ్లు నిర్మించాలని కోరారు. డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరారు.