కొండగట్టు అంజన్నకు
అగ్గిపెట్టెలో ఇమిడే శాలువా
NEWS Sep 14,2024 01:37 pm
కొండగట్టు అంజన్నకు అగ్గిపెట్టెలో ఇమిడే పట్టు శాలువాను నల్ల విజయ్ కుమార్ బహుకరించారు. సిరిసిల్లకు చెందిన చేనేతకారుడు నల్ల విజయ్ కుమార్ కుటుంబ సమేతంగా కొండగట్టు అంజన్నను దర్శించుకున్నాడు. తానే స్వయంగా నేసిన అగ్గిపెట్టెలో ఇమిడే పట్టు శాలువాను ఆలయ పర్యవేక్షకులు గుండి హరిహరనాథ్‌కు అందజేశారు. అర్చకులు ఆశీర్వదించి, ప్రసాదం అందజేశారు.