75 వేలకు చేరువైన బంగారం ధర
NEWS Sep 14,2024 09:22 am
బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరాయి. నిన్న ఒక్క రోజే 10 గ్రాముల బంగారంపై ధర రూ. 1200 పెరగగా.. నేడు 440 పెరిగి 74,890కి చేరింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.74,890 కి చేరుకుంది. 22 క్యారెంట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 68,650 కి చేరింది. సెప్టెంబర్ 13న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ. 400 పెరిగి రూ. 68,650 కు చేరింది. ఇక వెండి కిలో వెండి ధర రూ. 95వేలుగా ఉంది.