పోషకాహారం తీసుకోవాలి: కలెక్టర్
NEWS Sep 14,2024 09:14 am
సిరిసిల్ల జిల్లా: గర్భిణులు, బాలింతలు, పిల్లలు పోషకాహారం తీసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. ఎనీమియా నిర్ధారణ పరీక్షల ప్రత్యేక శిబిరాలు సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ప్రారంభం కాగా, గంభీరావుపేట మండలం లింగన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ గర్భంలోబాలింతలు మీ పరిధిలోని అంగన్వాడి కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని, ప్రతినెల పోషకాహారాన్ని తీసుకోవాలని.రక్త శాతం తక్కువ ఉన్నవారు మందులు, పండ్లు, డ్రైఫ్రూట్ తీసుకోవాలని సూచించారు.