జగిత్యాల జిల్లా రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామానికి చెందిన నర్సయ్య అనే వ్యక్తి వెదురు బొంగులతో వినాయకుడిని తయారు చేశాడు. వృత్తిరిత్యా బుట్టలు అల్లుతూ జీవనం సాగించే నర్సయ్యకు పలు రకాల అకృతులను తయారు చెయ్యడం ఇష్టం. అందుకే అతను ఈ నవరాత్రులకోసం 4 రోజులు కష్టపడి వినాయకుడిని తయారు చేశాడు. 9 రోజులపాటు పూజ కార్యక్రమం నిర్వహించి అనంతం నిమజ్జనం చేస్తామని చెపుతున్నాడు.