జోగిపేట: సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలోని పెద్ద మఠం ఆవరణలో చైతన్య యూత్ ఆధ్వర్యంలో కొలువుదీరిన గణపయ్య వద్ద శనివారం రవి ఫోటో స్టూడియో సాటికే రవి - జ్యోతి దంపతులు కుటుంబ సమేతంగా గణనాధునికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి అన్నదాన వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా దంపతులు మాట్లాడుతూ..గణేష్ నవరాత్రులు ఎంతో పవిత్రమైనవి. భక్తిశ్రద్ధలతో పూజలు చేసి నిమజ్జనం చేయాలని కోరారు.