హైకోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు గడగడ వణుకుతున్నారని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కొండాపూర్ లో ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పరామర్శించారు కేటీఆర్. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. రేవంత్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపాలి.. ఉరి తీయాలని మాట్లాడారు.. 10 మంది BRS ఎమ్మెల్యేలకు సీఎం రేవంతే కండువా కప్పారని చెప్పారు. కోర్టు తీర్పుతో ఫిరాయింపు ఎమ్మెల్యేల పదవి పోవడం గ్యారంటీ అని అన్నారు.