ఆధార్ అప్డేట్కు లాస్ట్ డేట్ నేడే
రేపటి నుంచి రూ.50 లు ఛార్జీ
NEWS Sep 14,2024 07:51 am
ఆధార్ కార్డు తీసుకొని పదేళ్లు దాటిన వారందరు అప్డేట్ చేసుకునేందుకు లాస్ట్ డేట్ ఇవాళ్టితో ముగిస్తుంది. వ్యక్తిగత గుర్తింపు, అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్లను సబ్మిట్ చేసి అప్డేట్ చేసుకోవాలని UIDAI తెలిపింది. సెప్టెంబర్ 15 నుంచి అప్‌డేట్ చేసుకోవాలంటే 50 రూపాయలు చెల్లించాలి. మీ సేవా కేంద్రాలు, ఆన్‌లైన్‌లో ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు. అయితే వేలిముద్రలు, ఐరీస్ స్కాన్స్, ముఖ చిత్రం వంటి బయోమెట్రిక్ సమాచారాన్ని ఆన్‌లైన్‌లో అప్డేట్ చేసుకోలేరని తెలిపింది.