అరికెపూడి గాంధీపై హత్యాయత్నం కేసు
NEWS Sep 14,2024 07:44 am
HYD: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి వ్యవహారంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదైంది. కౌశిక్‌రెడ్డి ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. గాంధీ సోదరుడు, కొడుకు పృథ్వీతోపాటు కార్పొరేటర్లు వెంకటేశ్ గౌడ్, శ్రీకాంత్‌లను నిందితులుగా చేర్చారు.