యాంకర్ శ్యామలకు YCP కీలక పదవి
NEWS Sep 14,2024 07:36 am
వైఎస్ జగన్.. వైసీపీలో కీలక మార్పులు చేస్తున్నారు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా నలుగురికి అవకాశం ఇచ్చారు. ఇందులో యాంకర్ శ్యామల కూడా ఉంది. యాంకర్ శ్యామలతో పాటు మాజీ మంత్రి ఆర్కే రోజా, భూమన కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకర రావులను కూడా రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ పీఏసీ సభ్యుడుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమించారు. చిత్తూరు జిల్లాతో పాటు తిరుపతి జిల్లా అధ్యక్షుడిగానూ బాధ్యతలు అప్పగించారు.