కౌన్ బనేగా కరోర్‌పతిలో పవన్‌పై ప్రశ్న
NEWS Sep 14,2024 07:16 am
అమితాబ్ హోస్ట్‌గా చేస్తున్న కౌన్ బనేగా కరోర్‌పతిలో కంటెస్టెంట్లకు.. 2024 జూన్‌లో ఆంధ్రప్రదేశ్‌లో ఓ నటుడు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆయన ఎవరు? అనే ప్రశ్న అడిగారు. దీనికి A, B, C, D ఆప్షన్లుగా పవన్ కల్యాణ్, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ పేర్లు ఉన్నాయి. అయితే, కంటెస్టెంట్లకు సరైన సమాధానం తెలియకపోవడంతో వారు ఆడియన్స్ పోల్‌కు వెళ్లారు. ఆడియన్స్ అందరూ ఆప్షన్ Aలోని పవన్ పేరు చెప్పారు. ఈ ప్రశ్న విలువ రూ. 1.60 లక్షలు.