వినాయకులను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే
NEWS Sep 14,2024 09:10 am
మల్యాల మండల కేంద్రంలోని పలు గణేష్ మండప నిర్వాహకుల ఆహ్వానం మేరకు విచ్చేసిన చొప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్ వినాయకులను దర్శించుకొని, పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రవిశంకర్ కు బీసీ కాలనీ వినాయకుని వద్ద మాజీ వార్డు సభ్యులు దశరథం శాలువాతో సత్కరించారు. ఆయన వెంట మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్, పోతారం సింగిల్ విండో చైర్మన్ సాగర్ రావు, గడ్డం రాజేశం, మీస రమేష్ మరియు మండల బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.