సింగపూర్ మిత్ర బృందం ఆర్థిక సహాయం
NEWS Sep 14,2024 09:10 am
మల్యాల మండల కేంద్రానికి చెందిన సంఘని లక్ష్మణ్ గత నెల రోజులుగా నోటి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ట్రీట్మెంట్ కు గాను 5 లక్షల వరకు ఖర్చు అవుతాయని డాక్టర్లు తెలపడంతో, విషయం తెలుసుకున్న సింగపూర్, మల్యాల మిత్ర బృందం లక్ష్మణ్ కు రూ.2,00,700 లక్షలు ఆర్థిక సహాయము అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రావణ్, శ్రీనివాస్, మహిపాల్, రమేష్, మధు, విక్రమ్, శ్రీధర్, స్వామిరెడ్డి, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.