కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో పనిచేసే చదలవాడ శ్రీను వరద ముంపు ప్రాంతమైన ఫెర్రీలో వరద నీరు తొలగించే క్రమంలో పాము కాటుకు గురయ్యారు. 3 రోజుల నుండి విజయవాడ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. చేయి తీవ్రంగా ప్రభావితం అవటంతో తొలగించే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.మున్సిపల్ అధికారులు స్పందించి బాధితుడికి మెరుగైన చికిత్స అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.