5 రోజుల్లో జిల్లాకు వర్షసూచన
NEWS Sep 14,2024 07:17 am
జగిత్యాల: ఉమ్మడి జిల్లాలో రాగల అయిదురోజుల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షసూచన ఉన్నట్లు పొలాస పరిశోధనస్థానం శాస్త్రవేత్త బి. శ్రీలక్ష్మి శుక్రవారం తెలిపారు. కాగా గాలిలో తేమ 59-88 శాతం, ఉష్ణోగ్రతలు కనిష్ఠంగా 22-23 డిగ్రీలు, గరిష్ఠంగా 30-31 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతాయని ఆమె వివరించారు.