అపారిశుధ్యంగా వారపు సంత
NEWS Sep 14,2024 09:09 am
అరకు వారపు సంతలో చెత్తచెదారం పేరుకు పోయి ఉండడంతో అపరిశుధ్యంగా దర్శనమిస్తుంది. దీంతో, సంతకు వచ్చిన గిరిజనులు పలు ఇబ్బందులు పడుతున్నారు. వారపు సంతలోని సంత షెడ్డు పరిసరాల్లో ప్లాస్టిక్ బాటిల్లు, కవర్లు పెరిగిపోయి ఉండగా, ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వర్షపు నీరు నిల్వ ఉండటంతో అపారిశుద్ధ్యంగా మారింది. పంచాయతీ అధికారులు స్పందించి పారిశుధ్యం మెరుగునకు చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు.