అటవీ ప్రాంతాల్లో చిరుత కదలికలు
NEWS Sep 14,2024 09:09 am
దివాన్ చెరువు అటవీ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన ట్రాప్ కెమెరాలో చిరుత సంచారానికి సంబంధించిన చిత్రాలు కనిపించాయని జిల్లా అటవీశాఖ అధికారి భరణి శుక్రవారం తెలిపారు. చిరుతను ట్రాప్ బోనులో పట్టుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నామని, కచ్చితంగా దాన్ని పట్టుకుంటామన్నారు. మరోవైపు అటవీ ప్రాంత సమీపంలోని ఆటోనగర్ నుంచి హౌసింగ్ బోర్డు కాలనీ వరకు నేషనల్ హైవేపై అప్రమత్తంగా ఉండాలని బోర్డులు ఏర్పాటు చేశామన్నారు.