పోషణ మాసోత్సవాలు సమావేశం
నిర్వహించిన సిడిపిఓ ఉమా రాణి
NEWS Sep 14,2024 09:09 am
కరీంనగర్: కొత్తపల్లి మండలంలోని శాంతి నగర్ అంగన్వాడీ కేంద్రంలో సభలో పోషణ మాసోత్సవాలు నిర్వహించారు. కరీంనగర్ (అర్బన్) సిడిపిఓ ఉమా రాణి మాట్లాడుతూ.. శాంతినగర్ అంగన్వాడీ కేంద్రాన్ని సరికొత్తగా ముస్తాబు చేస్తున్నామని, పెయింటింగ్ వేశామని, పిల్లలని అంగన్వాడి కేంద్రంకు పంపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎస్ అరుణ, ఎంపీడీవో ప్రభు, ఎంపీఓ నరసింహ రెడ్డి, చింతకుంట డా.నవ్య, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు పాల్గొన్నారు.