వైద్యారోగ్యశాఖ మంత్రి పర్యటన
NEWS Sep 14,2024 09:06 am
రాజమండ్రిలో నేడు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పర్యటించనున్నారు. 11- 12 గంటల వరకు స్థానిక వైద్య కళాశాల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి నిర్మాణాలు, వసతులను పరిశీలిస్తారు. అనంతరం ఏర్పాటుచేయనున్న సమీక్షలో పాల్గొంటారు. 2- 3 గంటల వరకు నగరంలో ఏర్పాటుచేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. 3 గంటలకు మధురపూడి నుంచి విమానంలో బెంగళూరు వెళ్తారు.