రాజమండ్రి: రాజమండ్రి పరిధి హుకుంపేటకు చెందిన 80 ఏళ్ల వృద్ధురాలిపై గుర్తు తెలియని వ్యక్తి లైంగిక దాడికి పాల్పడినట్లు బొమ్మూరు CI కాశీ విశ్వనాథం శుక్రవారం తెలిపారు. వివరాలు.. కుటుంబ కలహాల నేపథ్యంలో వృద్ధురాలు ఇంటి నుంచి బయటకు వచ్చి బస్టాప్‌లో ఉంటుందన్నారు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. లేవలేని స్థితిలో ఉన్న ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశామన్నారు.