మండపేట: మండపేట రూరల్ మండలంలోని పాలతోడు గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కోర్టు 15 రోజుల జైలు శిక్ష విధించింది. ఎస్సై సురేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. వాహన తనిఖీల్లో భాగంగా పాలతోడుకు చెందిన శ్రీను మద్యం తాగి వాహనం నడుపుతుండగా పట్టుబడ్డాడు. అతణ్ని ఆలమూరు జీఎఫ్సీఎం కోర్టులో హాజరుపరచగా 15 రోజుల జైలు శిక్ష విధించిందని తెలిపారు.