నేటి నుంచి రాష్ట్రస్థాయి పోటీలు
NEWS Sep 14,2024 07:52 am
అమలాపురం: ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్- 2024 పోటీలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. అమలాపురం ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్‌లో ఈ పోటీలు జరుగుతాయని క్రీడా జిల్లా అసోసియేషన్ కార్యదర్శి వెంకన్న నాయుడు శుక్రవారం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 400 మంది క్రీడాకారులు పోటీలకు హాజరవుతారని చెప్పారు. సబ్ జూనియర్స్, సీనియర్స్, మాస్టర్స్ విభాగాల్లో పురుషులు, మహిళలకు వేర్వేరుగా పోటీలు ఉంటాయన్నారు.