ఏలేశ్వరం: పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పర్యావరణ పరిరక్షణ సంఘం అధ్యక్షుడు డా.విజయ బాబు అన్నారు. శుక్రవారం సాయంత్రం సంఘ సభ్యులతో కలిసి ఏలేశ్వరంలో పర్యావరణ పరిరక్షణపై ముద్రించిన కరపత్రాలను ఇంటింటికి తిరిగి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భావితరాల భవిష్యత్తుకు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.